ISSకు పయనమైన ముగ్గురు వ్యోమగాములు

55చూసినవారు
ISSకు పయనమైన ముగ్గురు వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి మంగళవారం ముగ్గురు వ్యోమగాములు పయనమయ్యారు. రష్యాకు చెందిన సోయుజ్ MS-27 వ్యోమనౌక ద్వారా వీరు నింగిలోకి దూసుకెళ్లారు. కజకస్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదికైంది. వ్యోమగాముల్లో అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన జానీ కిమ్, రష్యాకు చెందిన సెర్గీ రిజికోవ్, అలెక్సీ జుబ్రిట్‌స్కీ ఉన్నారు. వీరు ISSలో 8 నెలల పాటు విధులు నిర్వర్తిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్