నేడు పోలీసు కస్టడీకి పోసాని

58చూసినవారు
నేడు పోలీసు కస్టడీకి పోసాని
AP: పోసాని కృష్ణమురళిని సీఐడీ పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనను విచారణ చేయడానికి కోర్టు తాజాగా అనుమతించింది. కాగా, చంద్రబాబు, పవన్‌లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను మీడియా సమావేశంలో పోసాని ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్