ముంబై హీరోయిన్ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పోలీసులు, వైసీపీ నేతలు కలిసి తనను హింసించారని, 15 రోజులు నరకం చూపించారని నటి జెత్వానీ కన్నీరుమున్నీరయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘అప్పట్లో నన్ను చిత్రహింసలు పెట్టిన వారిపై సాక్ష్యాలతో సహా ఏపీ పోలీసులకు అందజేస్తాను. ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది. 2014లో నాపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నన్ను ఒక ఆటబొమ్మలా వాడుకున్నారు.’ అని అన్నారు.