PPF స్కీమ్ కాల వ్యవధి 15 ఏళ్లు. ఒక ఏడాదిలో కనిష్ఠంగా రూ.500 నుంచి రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. మీరు రోజుకు రూ.417 పొదుపు చేసి ఈ పథకంలో పెట్టుబడి పెట్టారనుకుందాం. అంటే నెలకు రూ.12.500 మీరు కట్టాలి. ఇలా 15 ఏళ్ల పాటు కడితే మీ పెట్టుబడి మొత్తం రూ.22.50 లక్షలు అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మీకు దాదాపు రూ.40.68 లక్షలు అందుతుంది. దీన్ని మరో ఐదేళ్లు కూడా పెంచుకోవచ్చు. ఇలా 25 ఏళ్లకు పెంచుకుంటే రూ.కోటి వస్తుంది.