ఏపీలో కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ ఛార్జీలను పెంచడానికి ERC అంగీకరించడంతో డిసెంబర్ నుంచే కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి. అయితే తాను అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు మాట తప్పడంతో ఇదే అదనుగా వైసీపీ టీడీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యంగ్యాస్రాలు కురిపిస్తోంది. పుష్ప-2 మూవీలోని 'దెబ్బలు పడతాయోరో' సాంగ్‌ను జోడించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.