AP: రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఎయిర్ బస్ సర్వీసులు గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత ఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి ఎయిర్ పోర్టుకు ఇండిగో విమానం చేరుకుంది. అందులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు పురందీశ్వరి, ఉదయ్ ప్రయాణించారు. రన్ వే పై ల్యాండ్ అయిన విమానానికి సిబ్బంది వాటర్ కెనాన్స్ తో స్వాగతం పలికారు.