ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్‌పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించ
ాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలను హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.