AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, 3వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఉ.9 నుంచి మ.12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 10.58 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాల్లో అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్’ జోన్‌గా ప్రకటించారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు.
ALL THE BEST