ఒక్కప్పుడు చేతి నిండా పని ఉండేది. పండగలు, పెళ్లిళ్లకు విశ్రాంతి లేకుండా రాత్రి, పగలు తేడా లేకుండా పని చేసేవారు. అలాంటి దర్జీల వద్దకు ప్రజలు వచ్చి దుస్తులు కుట్టించుకుని పరిస్థితి లేదు. ఏపీలో గత ప్రభుత్వం చేదోడు పథకం ద్వారా టైలర్ దుకాణం ఉన్న ప్రతి టైలర్‌కు ఏడాదికి రూ.పది వేలు అందించింది. కాని ఇప్పుడు ఆ సాయం అందట్లేదు. తెలంగాణలోనూ వీరి పరిస్థితి దారుణంగా ఉంది.