ప్రభుత్వం పన్నులు, జీఎస్టీ ఫలితంగా క్లాత్ ధరలు భారీగా పెరిగాయి. కుట్టుకూలు సామగ్రి ధరలూ భారీగా పెరిగాయి. దీంతో సంప్రదాయ పద్ధతిలో బట్టలు కుట్టించుకోవడం ప్రజలు మానేశారు. ప్రభుత్వం వస్త్రాలపై పన్నులు తగ్గించి, ప్రజలకు చౌకగా దొరికేలా చూస్తే తమకు పూర్వ వైభవం వస్తుందని దర్జీలు అంటున్నారు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీ విద్యార్థుల యూనిఫాం కుట్టే ఆర్డర్లు తమకు ఇస్తే.. ఉపాధినిచ్చి ఆదుకునే వారవుతారని కోరుతున్నారు.