AP: పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో తాను చేరబోతున్నట్లు వస్తున్న ఆరోపణలపై తాజాగా వైసీపీ MLC తోట త్రిమూర్తులు స్పందించారు. అ వార్తలను ఆయన ఖండించారు. ఇటీవల జనసేన నేత సామినేని ఉదయభాను, త్రిమూర్తులు ఓ ఆలయంలో కలుసుకోవడంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారానికి బలం చేకూరింది. దీంతో తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, ఎప్పటికీ వైసీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని వెల్లడించారు.