TG: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.