అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం, ఎటపాకతో పాటు దేవీపట్నం మండలాన్నీ గోదావరి జలాలు చుట్టుముడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి గట్టున ఉన్న గండిపోశమ్మ ఆలయం గోపురం వరకు వరద నీరు చేరింది. మరోవైపు వరరామచంద్రాపురం మండలంలోని శ్రీరామగిరి, కల్తూనూరు, జీడిగుప్ప, ఇప్పూరు, పోచవరం, కొండేపూడి, తుమ్మిలేరు గ్రామాల్లో ముంపు సమస్య మొదలైంది.