ఎన్నికల ప్రచారానికి అలీ దూరం.. కారణమదేనా?

130904చూసినవారు
ఎన్నికల ప్రచారానికి అలీ దూరం.. కారణమదేనా?
గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన కమెడియన్ అలీ.. ఆ పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేశారు. ఆయనకు అధిష్టానం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవిచ్చింది. అయితే గత ఎన్నికల సమయంలో గుంటూరు ఈస్ట్ సీటు కోసం అలీ ప్రయత్నించగా సాధ్యపడలేదు. ఈ ఎన్నికల్లోనైనా సీటు దక్కుతుందని భావించినా నిరాశే మిగిలింది. దాంతో అలీ సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కడా కనిపించడం లేదు. టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్