సీఎం జ‌గ‌న్ ఒంట‌రి అయ్యారా..?

569చూసినవారు
సీఎం జ‌గ‌న్ ఒంట‌రి అయ్యారా..?
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒంట‌రి అయ్యారా..? అంటే ప‌రిస్థితులు అలానే అనిపిస్తున్నాయి. జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల ప్ర‌స్తుతం ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్నారు. మొన్న‌టివ‌ర‌కు జ‌గ‌న్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ సైతం ష‌ర్మిల‌నే స‌పోర్ట్ చేస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. ష‌ర్మిల‌ను గెలిపించి పార్ల‌మెంట్‌కు పంపాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. ఈ వీడియోలో సీఎం జ‌గ‌న్ పేరును ఎత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో జ‌గ‌న్ ఒంట‌రి అయిపోయాడ‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి.

సంబంధిత పోస్ట్