AP: జగన్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పూర్తిగా బద్దశత్రువుగా మాట్లాడుతున్నారని నేతలు అంటున్నారు. సీఐడీ విచారణకు హాజరైన తర్వాత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కోటరీ మాటలు వినడం జగన్ చేసిన తప్పంటూ కుండలు బద్దలు కొట్టారు. అన్ని కామెంట్లు చేసినా వైసీపీ ఆచితూచీ స్పందిస్తోంది. దాంతో విజయసాయిరెడ్డి వైసీపీని టెన్షన్ పెడుతున్నారా? ఆయనను టార్గెట్ చేస్తే ఇంకా ఇరిపోతామని వైసీపీ భావిస్తోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.