కారును ఎద్దులకు కట్టి లాక్కెళ్తున్న విచిత్ర సంఘటన రాజస్థాన్‌లోని దిద్వానా జిల్లాలో చోటుచేసుకుంది. కూచమన్ మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడు అనిల్ సింగ్ మెడ్తియాకు చెందిన ఎలక్ట్రిక్ కారు చెడిపోయింది. దీంతో చేసేది లేక అతను ఎద్దులకు కారును కట్టి వాటితో లాగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.