అర్చకులకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వరాల జల్లు

60చూసినవారు
అర్చకులకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వరాల జల్లు
దేశ రాజధాని ఢిల్లీలో 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఆప్ అధినేత కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. ఆప్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆలయాలు, గురుద్వారాల్లో పని చేసే పూజారులకు నెలకు రూ.18వేలు గౌరవ వేతనం అందిస్తామన్నారు.
ఈ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్