వైఎస్ జగన్ రుషికొండ ప్యాలెస్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అసెంబ్లీలో సెటైర్లు వేశారు. 'వైఎస్ జగన్ రూ.500 కోట్లతో కట్టుకున్నది ఇళ్లు కాదు.. రాజకీయ సమాధి. ఆ ప్యాలెస్‌కు వచ్చిన నెగటివిటీ వల్లే మంచి ప్రభుత్వ పాలన వచ్చింది. ప్రస్తుతం దానిని రాష్ట్ర సంపదగా భావించాలి. టిక్కెట్ పెట్టి సామాన్యులను అనుమతించాలి' అని రఘురామ అన్నారు.