YS జగన్‌కు జనసేన నేత నాగబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ట్విట్టర్ వేదికగా ఇవాళ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.