తపాలాశాఖ ఏడాదికి రూ.399తో రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. 18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా ఈ బీమా పాలసీ తీసుకోవచ్చు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షలు చెల్లిస్తారు. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే ఐపీడీ కింద రూ.60 వేలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తం.. ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. కుటుంబ ప్రయోజనాల కింద రూ.25 వేలు, అంత్యక్రియలకు రూ.5 వేలు అందిస్తారు.