చెన్నైలో ఆన్‌లైన్ రమ్మీ కారణంగా మరో యువకుడు బలైపోయాడు. చిన్నమలైలో నివసించే ఆకాష్ సోదరుడు, తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం తన తల్లికి చికిత్స నిమిత్తం ఇంట్లో ఉంచిన రూ.30 వేలతో ఆన్ లైన్ రమ్మీ ఆడి పొగొట్టుకున్నాడు. డబ్బులు కనిపించకపోవడంతో తల్లి, సోదరుడు గట్టిగా మందలించాడు. దీంతో డాబాపైకి వెళ్లి ఉరేసుకొని చనిపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.