AP : నేటి ఉదయం10 గంటలకు YCP అధినేత జగన్ వినుకొండకు బయల్దేరనున్నారు. గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వినుకొండ చేరుకుంటారని YCP వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు రషీద్ కుటుంబసభ్యులను పరామర్శిస్తారని పేర్కొంది. అనంతరం రోడ్డుమార్గంలోనే తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని వివరించింది.