తెలుగు ప్రజలకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక అని ఆయన అన్నారు.