‘మహా కుంభమేళా’ మొదటిరోజే ఉదయానికే దాదాపు 60 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇలా 45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'మహాకుంభమేళా వల్ల వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతాయి. ఒక్కో వ్యక్తి సగటున రూ.5వేలు ఖర్చు పెట్టినా.. మొత్తం రూ.2లక్షల కోట్లు అవుతుంది' అని CIAT జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖాండేవాల్ పేర్కొన్నారు.