బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను నిరసన సెగ తగిలింది. నితీశ్‌కుమార్ చేస్తున్న ప్రగతి యాత్రకు బీపీఎస్సీ విద్యార్థులు అడ్డుతగిలారు. సీఎం ఎదుట విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.