హైదరాబాద్‌లో చైనా మాంజాలపై 107 కేసులు

83చూసినవారు
హైదరాబాద్‌లో చైనా మాంజాలపై 107 కేసులు
నిషేధం ఉన్నా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో చైనా మాంజాలను వినియోగిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా కొందరు వ్యాపారులు చైనా మాంజాలను తెచ్చి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర టాస్క్‌ఫోర్స్‌ విభాగం, స్థానిక పోలీసులతో కలిసి చైనా మాంజా విక్రయాలపై నాలుగు నెలల్లో 107 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో 148ని అరెస్ట్‌ చేశారు. అలాగే, వారి వద్ద నుంచి రూ.90 లక్షల విలువైన 7334 చైనా మాంజా బబ్బిన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్