AP: గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నష్టం జరిగే పరిస్థితులు ఉత్పన్నమయ్యే సందర్భంలో న్యాయం కోసం పోరాడటానికి లక్షా 30 వేల మంది సిద్ధంగా ఉన్నారని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చెబుతోంది. దీనిపై చట్టానికి లోబడి ఐక్యకార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించింది.