ఏపీలో ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ మెసేజ్‌లను పంపుతోంది. దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. 'అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించండి. బాణసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి. ఇంటి కిటికీలు, తలుపులు, మూసేయండి. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు టపాసులు కాల్చాలి. టపాసులు వెలిగించి విచక్షణా రహితంగా విసరకండి' అని అలర్ట్ మెసేజ్ పంపుతోంది.