స్పెయిన్లోని వాలెన్సియా ప్రాంతంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 72 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. దక్షిణ స్పెయిన్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడి వీధులు బురద నీటితో నిండిపోయాయి. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.