జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ఈ నెల 22న ఎలాంటి షరతులు పెట్టకుండా జనసేనలో చేరుతున్నా. వైసీపీ విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నా. రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా' అని సామినేని ఉదయభాను వెల్లడించారు.