జగన్ ప్రభుత్వానికి జేపీ మార్కులు..!

548చూసినవారు
జగన్ ప్రభుత్వానికి జేపీ మార్కులు..!
వైఎస్ జగన్ పాలనకు జయప్రకాష్ నారాయణ మార్కులు ఇచ్చారు. ఏపీలో విద్యా వ్యవస్థకు కేవలం 2 మార్కులే (మొత్తం 5 మార్కులకు గాను) ఇచ్చారు. అలాగే వైద్య వ్యవస్థకు 2 మార్కులు, వాలంటీర్ వ్యవస్థకు 1 మార్కు ఇచ్చారు. 2019 నుండి 2024 వరకు అంటే గత ఐదేళ్లలో ఏపీలో జగన్ సర్కార్ పాలనకు కేవలం 1 నుండి 2 మార్కులు ఇచ్చారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ది అధ్వాన్నంగా వుందంటూ కేవలం 1 మార్కు ఇచ్చారు. మహిళా సాధికారతకు 2,హెల్త్ కేర్ కు 2, పెట్టబడుల ఆకర్షణ‌కు 1 మార్కు ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలన విషయంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందంటూ ఒకే ఒక మార్కు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్