ఏపీలో మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 222 మార్కెట్ యార్డ్ కమిటీలు, 21 ప్రముఖ దేవాలయాల పాలకమండళ్లలకు జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో పోస్టుకు ఇద్దరు నుంచి ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలకు సీఎం చంద్రబాబు ఆమోదం ఇవ్వగానే అధికారిక ప్రకటన రానుంది. వీటి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సిఫార్సులు చేశారు.