మూడు వేర్వేరు సంఘటనల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు చైన్ స్నాచర్లతో పాటు కారులో డబ్బు బ్యాగును చోరీ చేసిన డ్రైవర్‌ను శనివారం వరంగల్ పోలీసులు అరెస్టు చేసారు. 4లక్షల 90వేల రూపాయల విలువగల, 77. 750 గ్రాముల బంగారంతో పాటు 8లక్షల 10 వేల నగదు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులకు సంబంధించి వరంగల్ క సన్‌ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడించారు.