మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు
By Rathod 51చూసినవారుAP: వైసీపీ మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. జగన్ హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై కేసు నమోదైంది. ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది.