మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు: ఎమ్మెల్యే గండ్ర

53చూసినవారు
పవిత్రమైన రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా రేగొండ మండల కేంద్రంలోని మజీదులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక మండల కాంగ్రెస్ నేతలతో కలిసి శనివారం రాత్రి ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్