ప్రతి వాహనదారుడు వాహనానికి సంబంధించి రికార్డులు కలిగి ఉండాలని బద్వేలు ఎస్ఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల సర్కిల్ వద్ద సీఐ రాజగోపాల్ ఆదేశాల మేరకు ఎస్సై సత్యనారాయణ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రతి వాహనానికి క్షుణ్ణంగా పరిశీలించి వాహనానికి సంబంధించిన లైసెన్స్, ఇన్స్యూరెన్స్, రికార్డులను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు.