జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామ సమీపంలో ఉన్న మైలవరం ఉత్తరం కాలువను గురువారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కాలువను ధ్వంసం చేయడంతో నీటి ప్రవాహం పొన్నతోట వరి పొలాల్లోకి ప్రవహిస్తోంది. చుట్టు పక్కల వరి రైతులు అధిక నీరు పైరులో చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సమస్యను అరికట్టి కాలువ ప్రహరీ గోడను నిర్మించాలని కోరుతున్నారు.