మైలవరం జలాశయానికి నీటి సరఫరా నిలిపివేత

63చూసినవారు
మైలవరం జలాశయానికి నీటి సరఫరా నిలిపివేత
గండికోట నుంచి మైలవరం రిజర్వాయర్ కు పంపుతున్న నీటిని నిలిపివేసినట్లు జలవనరులశాఖ డీఈ ఉమామహేశ్వర్లు సోమవారం తెలిపారు. అవుకు జలాశయం నుంచి గండికోటకు వస్తున్న కృష్ణా జలాల ప్రవాహం పూర్తిగా తగ్గిపోయినట్లు తెలిపారు. మైలవరం రిజర్వాయర్ కు పంపుతున్న నీటిని నిలుపుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. గండికోటలో పూర్తినీటి సామర్థ్యం 26. 85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26. 33 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డీఈ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్