సంక్షేమం, అభివృద్ధికి చిరునామా టిడిపి అని కడప టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మాధవి అన్నారు. కడప నగరంలోని 47వ డివిజన్ పరిధిలోని నబీకోట రామాలయం వీధిలో బుధవారం భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టిడిపి అధికారంలోనికి రాగానే అమలు చేసే సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అయిదేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కడప నగరం అభివృద్ధి శూన్యమన్నారు. తాగేందుకు నీరు కూడా లేదని విమర్శించారు.