క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో క్యాన్సర్ రోగులకు ఊరట లభించింది. మూడు రకాల క్యాన్సర్ మందులపై కేంద్ర ప్రభుత్వం సుంకం ఎత్తివేసింది. దీంతో కొన్ని క్యాన్సర్ మందులు, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పరికరాల ధరలు దిగిరానున్నాయి.