ఒక వర్గం వారిని ఒక మతం వారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొడుతూ పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో చెన్నూరు సీఐ పురుషోత్తం రాజు పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా సోషల్ మీడియాను వాడుకోవాలని సూచించారు. గొడవలకు దారి తీసే విధంగా రెచ్చగొట్టే మాటలు విషయాలు పోస్ట్ చేయవద్దని చెన్నూరు మండలం సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులకు ఆయన హెచ్చరించారు.