Sep 22, 2024, 11:09 IST/
హైదరాబాదీయులకు బిగ్ అలర్ట్!
Sep 22, 2024, 11:09 IST
హైదరాబాదీయులకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు. తూర్పు హైదరాబాద్లో మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 గంటల్లోపు తూర్పు హైదరాబాద్లోని ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.