పీలేరు: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

52చూసినవారు
పీలేరు: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం మదనపల్లి ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం మేరకు చింతపర్తి గ్రామానికి చెందిన ఆదినారాయణ (55) కూలి పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వర్షాలు కురిసి కూలి పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై ఇంటిలోనే ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు అతనిని మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్