ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కొడుకు కొండారెడ్డి తనపై అవినీతి ఆరోపణలు చేయలేదని విచారణ చేసి నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడానికి తనపై అవినీతి ఆరోపణలు చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక కూడా రోజూ అవే ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏసీబీ, సీఐడీలతో విచారణ చేసి నాలుగేళ్లలో తన అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు.