ప్రొద్దుటూరు: రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

64చూసినవారు
ప్రొద్దుటూరు: రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
రైతుల అభివృద్ధే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ జడ్పీటీసీ, టీడీపీ సీనియర్ నాయకుడు తోట మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాజుపాలెం మండలం సోమాపురం, అర్కటవేముల గ్రామాల్లో నిర్మించిన మినీ గోకులాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పశువుల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మినీ గోకులం షెడ్లను నిర్మించిందని తెలిపారు. సర్పంచ్ ప్రభావతి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్