ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమ గొప్పలు చెప్పుకొని, జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రాచమల్లు మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడపిల్లలైనా బయటకు వెళితే భద్రంగా ఇంటికి వస్తారన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్