కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ లోతేటి శివశంకర్ ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులను విడుదల చేశారు. బదిలీలు అయిన డిప్యూటీ తహశీల్దార్లు వెంటనే తమకు కేటాయించిన ప్రాంతంలో విధులలో చేరాలని సూచించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 59 మందిని బదిలీల్లో భాగంగా పోస్టింగ్ లు కేటాయించారు.