పులివెందుల మండలంలో శనివారం టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వైసీపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డిని, ఆదివారం కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత నాలుగు నెలల కాలంలో టీడీపీ నాయకులు పనికట్టుకుని మరీ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు.