పులివెందుల పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో శనివారం ఆలయ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆలయ ఛైర్మన్ సుధీకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర క్యాలెండర్లు ఆలయంలో అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ క్యాలెండర్లను తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి వెంకటరమణ, అర్చకులు కృష్ణ రాజేష్ శర్మ, ఆలయ ట్రస్ట్ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.